​డిసెంబర్ 21న వనపర్తికి సీఎం రేవంత్​రెడ్డి :    ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: ఈ నెల 21న వనపర్తికి సీఎం రేవంత్​రెడ్డి రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలో హాస్పిటల్​ నిర్మాణానికి టెక్నికల్​ శాంక్షన్​ వచ్చిందని, సీఎం శంకుస్థాపన​చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలో 200 ఎల్వోసీలు,2,400 సీఎంఆర్ఎఫ్​ చెక్కులు, 1,100 కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల మాదిరిగా కాకుండా తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నానని చెప్పారు.

జిల్లాలో రోడ్​ వైడెనింగ్, మెడికల్​ కాలేజీ కాంట్రాక్టర్లకు రూ.280 కోట్ల డ్యూస్​ ఉంటే వారికి బిల్లులు ఇప్పించామన్నారు. టీఎఫ్ఐఎస్​డీసీ కింద రూ.50 కోట్లు ఇస్తామని గత నేతలు చెప్పి ఇవ్వలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక రూ.35 కోట్లు సీసీ రోడ్లకు ఇస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లకు రూ.10 కోట్లు వస్తున్నాయని తెలిపారు. మున్సిపల్​ చైర్మన్​ పి.మహేశ్, చీర్ల చందర్, కౌన్సిలర్లు వెంకటేశ్, సత్యం పాల్గొన్నారు.